ప్లాస్టిక్‌ వ్యర్థాలతో సీసీ రోడ్డు

పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో  మహారాష్ట్రలోని అమరావతి ప్రాంత రామ్‌మేఘ ఇంజినీరింగ్‌ కళాశాల పరిశోధకులు సీసీ రోడ్లు నిర్మించారు.

Published : 02 Mar 2024 05:13 IST

మహారాష్ట్ర కళాశాల పరిశోధనకు పేటెంట్‌

పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో  మహారాష్ట్రలోని అమరావతి ప్రాంత రామ్‌మేఘ ఇంజినీరింగ్‌ కళాశాల పరిశోధకులు సీసీ రోడ్లు నిర్మించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువకాలం మన్నిక ఉండేలా రూపొందిన ఈ పరిశోధనకు భారత ప్రభుత్వం నుంచి పేటెంటు హక్కు లభించింది. స్థానిక ఇన్నోవేటివ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ బోర్డు భాగస్వామ్యంతో ఈ పరిశోధన చేశారు. ఈ రకమైన పరిశోధన ఆఫ్రికాలో 2005లోనే జరిగింది. దీని ఆధారంగా ఐఐటీ ఖరగ్‌పుర్‌ 2010-12 మధ్యకాలంలో ఇలాంటి పరిశోధనలు చేపట్టింది. రామ్‌మేఘ ఇంజినీరింగ్‌ కళాశాల పరిశోధక బృందం ఇదే పద్ధతిని మరింత అభివృద్ధి చేసింది. కళాశాల ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌ హర్లే ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో సెల్స్‌ ఆకారంలో తయారుచేసి, సీసీ రోడ్డు నిర్మాణంలో వాడారు. ‘‘తారు రోడ్డుతో పోలిస్తే ఈ రోడ్డు నిర్మాణవ్యయం 20 శాతం తక్కువ. దాదాపు 20 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నాం’’ అని ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌ వెల్లడించారు.  - ఈటీవీ భారత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు