మోదీ మళ్లీ ప్రధాని కావాలని సైకిలుపై 12 జ్యోతిర్లింగాల యాత్ర

ముంబయికి చెందిన షబ్నమ్‌ షేక్‌ అనే యువతి తన అభిమాన నాయకుడు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని సైకిల్‌ యాత్ర చేపట్టింది.

Published : 02 Mar 2024 05:55 IST

ముంబయికి చెందిన షబ్నమ్‌ షేక్‌ అనే యువతి తన అభిమాన నాయకుడు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని సైకిల్‌ యాత్ర చేపట్టింది. దేశవ్యాప్తంగా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు ఆమె చెబుతోంది. రోజుకు 80 నుంచి 90 కిలోమీటర్లు సైకిలు తొక్కుతున్న షబ్నమ్‌ మరో 7-8 నెలల్లో యాత్రను పూర్తి చేస్తానని ధీమాగా చెబుతోంది. సైకిలుకు కాషాయ జెండాలు కట్టి అందంగా తీర్చిదిద్దింది. తన స్నేహితుడితో కలిసి ఈ యాత్రను ప్రారంభించిన ఆమె హుషారుగా సైకిలు తొక్కుతూ మహారాష్ట్రలో ఉన్న రెండు జ్యోతిర్లింగాలను ఇప్పటికే దర్శించుకుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని బడ్వానీ జిల్లాకు చేరుకుంది. రాష్ట్రంలోని ఓం కారేశ్వర్‌ వద్దకు.. ఆ తర్వాత ఉజ్జయినిలోని  మహాకాల్‌కు వెళ్లనున్నట్లు షబ్నమ్‌ చెప్పింది. ‘జై శ్రీరామ్‌, హర్‌హర్‌ మహాదేవ్‌’ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈమె గతంలో అయోధ్య రామయ్య దర్శనానికి కూడా ఇలాగే సైకిలుపై వెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని