వార్తా పత్రికల రిజిస్ట్రేషన్లకు కొత్త చట్టం అమలు

వార్తా పత్రికలు, మ్యాగజీన్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. గతంలో ఉన్న 1867నాటి ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బుక్స్‌ చట్టం స్థానంలో దీనిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

Published : 03 Mar 2024 03:25 IST

దిల్లీ: వార్తా పత్రికలు, మ్యాగజీన్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. గతంలో ఉన్న 1867నాటి ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బుక్స్‌ చట్టం స్థానంలో దీనిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ చట్టం-2023ని (పీఆర్‌పీ) ప్రభుత్వం నోటిఫై చేయడంతోపాటు నిబంధనలను గెజిట్‌లో పేర్కొంది. దీంతో ఈ నెల 1వ తేదీ నుంచి చట్టం అమల్లోకి వచ్చిందని శనివారం విడుదలైన అధికారిక ప్రకటన వెల్లడించింది. కొత్త చట్టం ప్రకారం.. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌పేపర్స్‌ ఫర్‌ ఇండియా బాధ్యతలను ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌జీఐ) కార్యాలయం నిర్వహిస్తుంది. ఇక నుంచీ వార్తా పత్రికలు, మ్యాగజీన్ల రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లోనే అనుమతులిస్తారు. గతంలోలా పలు దశలు, వృథా ప్రయాస లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కలుగుతుంది. కొత్త రిజిస్ట్రేషన్లతోపాటు యాజమాన్యాల మార్పిడి, వార్షిక నివేదిక, ఆడిట్‌ వెరిఫికేషన్‌ ఆఫ్‌ సర్కులేషన్‌వంటివన్నీ ఈ ఆన్‌లైన్‌ వేదికగానే చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని