ప్రజలింకా మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు

తమ సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ప్రజలు.. మంత్రగాళ్లను, బాబాలను ఆశ్రయిస్తున్నారని, ఇదో దురదృష్టకర వాస్తవమని బొంబాయి హైకోర్టు పేర్కొంది.

Published : 03 Mar 2024 04:16 IST

ఇదో దురదృష్టకర వాస్తవం: బొంబాయి హైకోర్టు

ముంబయి: తమ సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ప్రజలు.. మంత్రగాళ్లను, బాబాలను ఆశ్రయిస్తున్నారని, ఇదో దురదృష్టకర వాస్తవమని బొంబాయి హైకోర్టు పేర్కొంది. మేధో వైకల్యం ఉన్న ఆరుగురి బాలికలపై లైంగిక దాడి చేసిన ఓ మంత్రగాడికి ట్రయల్‌ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తూ.. న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రస్తుత కాలంలోనూ.. అంధ విశ్వాసాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే కేసిది. ఇంకా కొంత మంది తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రగాళ్ల తలుపులు తడుతున్నారు. ఇలాంటి వారి విశ్వాసాలను బలహీనతలను ఉపయోగించుకొని బాబాలు, మంత్రగాళ్లు దోపిడీ చేస్తున్నారు’’ అని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని