అమృత్‌ ఉద్యాన్‌ సందర్శన వేళలు మరో గంట పొడిగింపు

రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యాన్‌ సందర్శన సమయాన్ని గంటపాటు పొడిగించారు. ఇప్పటివరకూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు ఉద్యానం అందుబాటులో ఉండగా, ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకూ దాన్ని తెరిచి ఉంచనున్నారు.

Published : 03 Mar 2024 04:17 IST

రాష్ట్రపతి భవన్‌ ప్రకటన

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యాన్‌ సందర్శన సమయాన్ని గంటపాటు పొడిగించారు. ఇప్పటివరకూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు ఉద్యానం అందుబాటులో ఉండగా, ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకూ దాన్ని తెరిచి ఉంచనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 31 వరకూ సోమవారాలు మినహా ప్రతిరోజూ ఉద్యానాన్ని సందర్శించవచ్చని పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకూ సందర్శకులను ఉద్యానం లోపలికి అనుమతించనున్నారు. రాష్ట్రపతి భవన్‌ వెబ్‌సైట్లో ముందుగా బుక్‌ చేసుకోవచ్చు. నేరుగా వచ్చేవారు కౌంటర్ల వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు