నేపాల్‌ మేయర్‌ కుమార్తె ఆచూకీ లభ్యం

గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్‌లోని ధన్‌గఢీ నగర మేయర్‌ కుమార్తె ఆర్తీ హమాల్‌(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.

Updated : 28 Mar 2024 06:00 IST

పణజీ: గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్‌లోని ధన్‌గఢీ నగర మేయర్‌ కుమార్తె ఆర్తీ హమాల్‌(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. ఉత్తర గోవాలోని ఓ హోటల్లో తన ఇద్దరు స్నేహితురాళ్లతో ఆమె కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ధ్యాన సాధన చేసేందుకు ఆర్తీ నెల రోజుల క్రితం ఉత్తర గోవాలోని మాండ్రెంలో ఉన్న ఓషో ధ్యాన కేంద్రానికి వచ్చారు. ఈ నెల 25 నుంచి ఆమె కనిపించకుండా పోవడతో కలకలం రేగింది. ఆమె తల్లిదండ్రులు నేపాల్‌ నుంచి గోవాకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. ‘ఆర్తీ తన మొబైల్‌ ఫోన్‌ను ధ్యాన కేంద్రంలోనే ఉంచారు. దీంతో సాంకేతికతను ఉపయోగించి ఆమె జాడ కనిపెట్టడం సాధ్యం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ హోటల్లలో ఆమె కోసం వెతికాం. ఉత్తర గోవాలోని చోప్డం గ్రామంలోని ఓ హోటల్లో తన ఇద్దరు స్నేహితురాళ్లతో కనిపించించారు’ అని పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని