మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్‌ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీలకు బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.

Published : 28 Mar 2024 04:39 IST

 నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశం

దిల్లీ: విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్‌ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీలకు బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. గురువారం దిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇదివరకు రెండుసార్లు ఈడీ నోటీసులిచ్చినా అధికారిక పనులున్నాయంటూ ఆమె గైర్హాజరయ్యారు. దీంతో తాజా నోటీసు జారీ అయింది. మొయిత్రా విషయంలో బుధవారం ఒక న్యాయవాదిని ఈడీ ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టింది. హీరానందానీపై మరో ఫెమా కేసులోనూ సమన్లు జారీ అయ్యాయి. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే కేంద్రం ఈడీ ద్వారా మహువాకు సమన్లు ఇచ్చిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎన్నికల ముందు దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని