తేజస్‌ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం

తేజస్‌ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్‌ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది.

Published : 29 Mar 2024 05:48 IST

ఈనాడు, బెంగళూరు: తేజస్‌ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్‌ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. గురువారం బెంగళూరులోని ఆ సంస్థ ప్రాంగణం నుంచి టేకాఫ్‌ అయిన ఎల్‌ఏ-5003.. 18 నిమిషాల పాటు గాల్లో విహరించి సురక్షితంగా ల్యాండ్‌ అయింది. పైలట్‌ గ్రూప్‌ (విశ్రాంత) అధికారి కెప్టెన్‌ కె.కె.వేణుగోపాల్‌ ఈ విమానాన్ని నడిపారు. హెచ్‌ఏఎల్‌ ప్రయాణంలో ఇదో మైలురాయి అని ఆ సంస్థ సీఎండీ సి.బి.అనంతకృష్ణన్‌ అభివర్ణించారు. విమానం తయారీకి సహకరించిన రక్షణ శాఖ, వైమానికదళం, డీఆర్‌డీఓ సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని