నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్‌

ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్‌ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్‌ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్‌ చేశారు.

Published : 29 Mar 2024 04:41 IST

రాంచీ: ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్‌ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్‌ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్‌ చేశారు. ఝార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జేఎంఎం తనను నిర్లక్ష్యం చేస్తోందంటూ ఈమె ఇటీవల భాజపాలో చేరారు. జైలులో ఉన్న మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన తనను అవమానించినట్లు కూడా సీత ఆరోపణలు చేశారు. ‘‘రాష్ట్రంలో జేఎంఎం పటిష్ఠతకు అహరహం శ్రమించిన నా భర్త దుర్గా సోరెన్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. కాబట్టే, దర్యాప్తు కోరుతున్నా’’ అని మీడియా సమావేశంలో ఆమె తెలిపారు. రాష్ట్రంలోని దుమ్కా లోక్‌సభ స్థానం నుంచి సీతా సోరెన్‌ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని