గురుద్వారా కర్‌ సేవా చీఫ్‌పై కాల్పులు

ఉత్తరాఖండ్‌లోని ఉధాంసింగ్‌ నగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్‌మత్తా సాహిబ్‌ గురుద్వారాకు చెందిన డేరా కర్‌ సేవా చీఫ్‌ బాబా తర్‌సేమ్‌ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

Published : 29 Mar 2024 04:42 IST

చికిత్స పొందుతూ మృతి

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఉధాంసింగ్‌ నగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్‌మత్తా సాహిబ్‌ గురుద్వారాకు చెందిన డేరా కర్‌ సేవా చీఫ్‌ బాబా తర్‌సేమ్‌ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం గురుద్వారా ప్రాంగణంలోకి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తర్‌సేమ్‌ సింగ్‌పై రైఫిల్‌తో కాల్పులు జరిపి పారిపోయారు. కుప్పకూలిన బాధితుణ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి ఆయన ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని