సునీతా కేజ్రీవాల్‌ను కలిసిన హేమంత్‌ సోరెన్‌ భార్య

మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెనక ఝార్ఖండ్‌ మొత్తం నిలిచి ఉందని జేఎంఎం అధినేత, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ పేర్కొన్నారు.

Published : 31 Mar 2024 03:26 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెనక ఝార్ఖండ్‌ మొత్తం నిలిచి ఉందని జేఎంఎం అధినేత, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ పేర్కొన్నారు. శనివారం ఆమె అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలసి సంఘీభావం తెలిపారు. ‘‘ఝార్ఖండ్‌లో రెండు నెలల క్రితం ఏం జరిగిందో దిల్లీలోనూ అదే జరిగింది. నా భర్త హేమంత్‌ సోరెన్‌ను జైలుకు పంపారు. ఇక్కడ అరవింద్‌ కేజ్రీవాల్‌ను పంపారు. సునీతా కేజ్రీవాల్‌ బాధను పంచుకోవడానికి నేనిక్కడకు వచ్చాను. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇద్దరం నిశ్చయించుకున్నాం’’ అని సమావేశానంతరం విలేకరులతో కల్పనా సోరెన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని