భూతం.. పిశాచం అనడం క్రౌర్యం కిందికి రాదు: పట్నా హైకోర్టు

విడిపోయిన దంపతులు ఒకరినొకరు భూతం, పిశాచం అని తిట్టుకోవడం మానసిక క్రౌర్యం కిందికి రాదని పట్నా హైకోర్టు వ్యాఖ్యానించింది.

Updated : 31 Mar 2024 05:59 IST

పట్నా: విడిపోయిన దంపతులు ఒకరినొకరు భూతం, పిశాచం అని తిట్టుకోవడం మానసిక క్రౌర్యం కిందికి రాదని పట్నా హైకోర్టు వ్యాఖ్యానించింది. విడాకులు పొందిన మహిళను 21వ శతాబ్దిలో ఇలా దుర్భాషలాడటం దారుణమని ఆమె తరఫు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చింది. దంపతులు విడిపోయినప్పుడు పరస్పరం దుర్భాషలాడుకోవటం మామూలేనని న్యాయమూర్తి జస్టిస్‌ వివేక్‌ చౌధరి వ్యాఖ్యానించారు. ఝార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్‌కుమార్‌ గుప్తా, ఆయన తండ్రి సహదేవ్‌ గుప్తాలపై నరేశ్‌ భార్య బిహార్‌లోని తన స్వస్థలం నవాదాలో 1994లో కేసు పెట్టారు. కారును వరకట్నంగా ఇవ్వాలంటూ వారు వేధిస్తున్నారని ఆరోపించారు. తర్వాత ఈ కేసును నవాదా నుంచి నలందకు బదిలీ చేశారు. అక్కడి చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ వారికి 2008లో ఏడాది చొప్పున జైలుశిక్ష విధించారు. అదనపు సెషన్స్‌ కోర్టు వారి అప్పీలును పదేళ్ల తరవాత కొట్టేసింది. ఈలోపు ఝార్ఖండ్‌ హైకోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ట్రయల్‌ కోర్టు తీర్పును పట్నా హైకోర్టులో నరేశ్‌, సహదేవ్‌ సవాల్‌ చేశారు. విడిపోయిన భార్య వాదనను న్యాయమూర్తి కొట్టేశారు. ఆమె నిర్దిష్ట ఆరోపణలేవీ చేయలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు