జ్ఞానవాపీ కమిటీ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలకు ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది.

Published : 01 Apr 2024 05:27 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలకు ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. మసీదులో హిందువులు పూజలు నిర్వహించుకోవడానికి అనుమతినిస్తూ దిగువ కోర్టు జారీ చేసిన తీర్పును ఫిబ్రవరి 26న అలహాబాద్‌ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని