సీయూఈటీ-2024 దరఖాస్తుల గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీయే

దేశవ్యాప్తంగా పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే  ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ)-2024 కోసం దరఖాస్తుల గడువును ఎన్టీయే మరోసారి పొడిగించింది.

Published : 01 Apr 2024 05:28 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే  ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ)-2024 కోసం దరఖాస్తుల గడువును ఎన్టీయే మరోసారి పొడిగించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఏప్రిల్‌ 5ను చివరి తేదీగా ప్రకటించింది. పలువురు విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం వెల్లడించింది. దీంతో అర్హులైన విద్యార్థులు ఏప్రిల్‌ 5 రాత్రి 9.50 గంటల్లోపు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షలను మే 15 నుంచి 30వరకు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని