జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌కు వీడ్కోలు

పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌కు సుప్రీంకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. 2019 మే 24వ తేదీన అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన బుధవారం పదవీ విరమణ చేశారు.

Published : 11 Apr 2024 04:20 IST

దిల్లీ: పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌కు సుప్రీంకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. 2019 మే 24వ తేదీన అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన బుధవారం పదవీ విరమణ చేశారు. కోర్టులో ఐదో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న ఆయన చివరి రోజున సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని వీడ్కోలు ధర్మాసనంలో విధులు నిర్వర్తించారు. చివరి వ్యక్తి వరకూ న్యాయం చేయాలని తపన జస్టిస్‌ బోస్‌లో ఎల్లప్పుడూ ఉండేదని ఈ సందర్భంగా సీజేఐ పేర్కొన్నారు. ఆయన తనకు స్నేహితుడని, ఎన్నో సుగుణాలున్నాయని కొనియాడారు. తదుపరి చేపట్టబోయే జాతీయ జుడీషియల్‌ అకాడమీ డైరెక్టరు పదవి ఆయనకు సరిగ్గా సరిపోతుందని తెలిపారు.  తనకు సహకరించిన న్యాయమూర్తులకు, బార్‌ సభ్యులకు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని