సీపీఎంకు 80 రహస్య బ్యాంకు ఖాతాలు

కేరళలోని అధికార పార్టీ సీపీఎంకు త్రిశ్శూర్‌ జిల్లాలో 80 రహస్య (వెల్లడించని) బ్యాంకు ఖాతాలు, 100 కార్యాలయాలు (స్థిరాస్తులు) ఉన్నాయని ఎన్నికల సంఘానికి (ఈసీకి) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నివేదించింది.

Published : 11 Apr 2024 04:21 IST

ఈసీకి ఈడీ నివేదిక

దిల్లీ: కేరళలోని అధికార పార్టీ సీపీఎంకు త్రిశ్శూర్‌ జిల్లాలో 80 రహస్య (వెల్లడించని) బ్యాంకు ఖాతాలు, 100 కార్యాలయాలు (స్థిరాస్తులు) ఉన్నాయని ఎన్నికల సంఘానికి (ఈసీకి) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నివేదించింది. మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తు సందర్భంగా వీటిని కనుగొన్నామని పేర్కొంది. త్రిశ్శూర్‌ కేంద్రంగా పనిచేసే కరువన్నూర్‌ సర్వీస్‌ కోపరేటివ్‌ బ్యాంకుతోపాటు కేరళ సీపీఎం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏసీ మొయిదీన్‌ను విచారించిన సందర్భంగా ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపింది. బుధవారం ఈడీ వర్గాల వివరాల ప్రకారం..

  • రూ.25 కోట్ల డిపాజిట్లున్న వెల్లడించని బ్యాంకు ఖాతాలు సీపీఎంకు ఉన్నాయి. ఈ డిపాజిట్లలో సింహభాగాన్ని నగదు రూపంలోనే వెనక్కి తీసుకున్నారు. - పార్టీ కార్యాలయాల పేరుతో 100 స్థిరాస్తులు జిల్లాలో సీపీఎంకు ఉన్నాయి. వీటిని పార్టీ వెల్లడించలేదు.
  • బ్యాంకు ఖాతాలను, స్థిరాస్తులను పార్టీ కార్యకలాపాల కోసం సీపీఎం వాడుకుంటోంది.
  • ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఈ వివరాలను ఎన్నికల సంఘానికి, ఆదాయ పన్నుశాఖకు సీపీఎం తెలియజేయలేదు.

విచారణకు ఈసీ ఆదేశం

ఈడీ అందించిన ఈ ఖాతాలు, స్థిరాస్తులపై విచారణ జరపాలని సీబీడీటికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని