నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల అటాచ్‌ సబబే

మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక, ఇతర సంస్థలకు చెందిన రూ.752 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని న్యాయనిర్ణయాక సంస్థ పీఎంఎల్‌ఏ సమర్థించింది.

Published : 11 Apr 2024 04:21 IST

పీఎంఎల్‌ఏ స్పష్టీకరణ

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక, ఇతర సంస్థలకు చెందిన రూ.752 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని న్యాయనిర్ణయాక సంస్థ పీఎంఎల్‌ఏ సమర్థించింది. ఈడీ ఎటాచ్‌ చేసిన చరాస్తులు, ఈక్విటీ వాటాలు మనీలాండరింగ్‌ నేరానికి సంబంధించినవిగా భావిస్తున్నట్లు బుధవారం తన ఆదేశాల్లో పేర్కొంది. గతేడాది నవంబరులో ఈడీ ఆయా ఆస్తులన్నింటినీ ఎటాచ్‌ చేసింది. యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ‘ది నేషనల్‌ హెరాల్డ్‌’ను ఏజేఎల్‌ సంస్థ ప్రచురించేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు