నా పిటిషన్‌ను త్వరగా విచారించండి

దిల్లీ మద్యం విధానంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్‌ కేసులో తన అరెస్టును  హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Updated : 11 Apr 2024 05:34 IST

సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్‌ విజ్ఞప్తి
సరేనన్న సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

దిల్లీ: దిల్లీ మద్యం విధానంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్‌ కేసులో తన అరెస్టును  హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆయన తరఫున న్యాయవాది వివేక్‌ జైన్‌ బుధవారం వెల్లడించారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ సందర్భంగా తన పిటిషన్‌ను త్వరగా విచారించాలంటూ కేజ్రీవాల్‌ సుప్రీంను అభ్యర్థించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ స్పందిస్తూ ఆయన వినతిని పరిశీలిస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించి ఓ ఈ-మెయిల్‌ను తనకు పంపాలంటూ కేజ్రీవాల్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని