ఈద్‌ ప్రార్థనల కోసం తెరుచుకున్న చర్చి గేట్లు

కేరళలోని మలప్పురం జిల్లా మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్‌ మెమోరియల్‌ సీఎస్‌ఐ చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్‌ ప్రార్థనలు చేసుకోడానికి ముస్లిం సోదరులను ఆహ్వానిస్తూ బుధవారం చర్చి అధికారులు గేట్లు తెరిచారు.

Updated : 11 Apr 2024 08:49 IST

కేరళలో వెల్లివిరిసిన మత సామరస్యం

మలప్పురం: కేరళలోని మలప్పురం జిల్లా మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్‌ మెమోరియల్‌ సీఎస్‌ఐ చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్‌ ప్రార్థనలు చేసుకోడానికి ముస్లిం సోదరులను ఆహ్వానిస్తూ బుధవారం చర్చి అధికారులు గేట్లు తెరిచారు. పట్టణ ముస్లింలు స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఈద్‌ ప్రార్థనలు చేసుకునేవారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా పాఠశాల మూతపడింది. దీంతో ఈద్‌ ప్రార్థనలకు గేట్లు తెరవాలని చర్చి పెద్దలు నిర్ణయించి ముస్లిం ప్రముఖులకు తెలియజేయడంతో ఆ ప్రాంగణం మత సామరస్యానికి వేదికగా మారింది. చర్చి ఆవరణలో రంజాన్‌ ప్రార్థనలు చేసేందుకు వందల సంఖ్యలో ముస్లిం సోదరులు విచ్చేసిన దృశ్యం కనువిందు చేసిందని, ఇదీ నిజమైన ‘కేరళ స్టోరీ’ అని నెటిజన్లు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని