ఝార్ఖండ్‌లో 15 మంది మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతమైన ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భుమ్‌లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Published : 12 Apr 2024 05:19 IST

రాంచీ: మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతమైన ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భుమ్‌లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీపీఐ (మావోయిస్టు) పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్‌ బెస్రా సహా 15 మంది గురువారం భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న ఆయుధాలను కూడా అప్పగించారు. పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటున్న మిసిర్‌ బెస్రా తలపై పోలీసులు గతంలో రూ.కోటి రివార్డు ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ఒక మైనర్‌, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా ఒకే దళానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో కొరియర్‌ అరెస్ట్‌

నక్సలైట్‌ నేతలకు కొరియర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మొహ్లా-మన్‌పుర్‌-అంబాగడ్‌చౌకీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చిన కరపత్రాలను పంచుతున్న అశ్వంత్‌ ఆనందియాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విజయ్‌రెడ్డి, లోకేశ్‌ సలామే, రూపేశ్‌, మంగేశ్‌, వినోద్‌ తదితర మావోయిస్టు నేతలకు డబ్బు చేరవేస్తున్నట్లు అశ్వంత్‌ ఆనందియా అంగీకరించారని  వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని