ఏఐతో న్యాయవ్యవస్థకూ సవాళ్లు: సీజేఐ

న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంతో అవకాశాలతో పాటు సవాళ్లూ ఉన్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Published : 14 Apr 2024 03:49 IST

దిల్లీ: న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంతో అవకాశాలతో పాటు సవాళ్లూ ఉన్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఏఐ వాడకంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నైతిక విలువలు, జవాబుదారీతనం, పక్షపాతం తదితర అంశాలకు సంబంధించి ఏఐ నుంచి ఎదురయ్యే సవాళ్లనెలా అధిగమించాలన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలని అన్నారు. సింగపూర్‌, భారత సుప్రీంకోర్టుల మధ్య సాంకేతికత, సంవాదంపై జరుగుతున్న రెండు రోజుల సదస్సును ఉద్దేశించి సీజేఐ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని