స్వదేశీ ట్యాంకు విధ్వంసక ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన సైన్యం

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘మ్యాన్‌ పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌ (ఎంపీఏటీజీఎం)’ ఆయుధ వ్యవస్థ భారత అమ్ములపొదిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

Published : 15 Apr 2024 04:49 IST

దిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘మ్యాన్‌ పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌ (ఎంపీఏటీజీఎం)’ ఆయుధ వ్యవస్థ భారత అమ్ములపొదిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన ఈ తేలికపాటి ట్యాంకు విధ్వంసక ఆయుధ వ్యవస్థను సైన్యం పోఖ్రాన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో శనివారం విజయవంతంగా పరీక్షించింది. భిన్న పరిస్థితుల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో క్షిపణి, వార్‌హెడ్‌ విశేష పనితీరు కనబరిచాయని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాత్రివేళల్లోనూ వినియోగానికి ఎంపీఏటీజీఎం అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యవస్థను క్షేత్రస్థాయిలో విజయవంతంగా పరీక్షించినందుకు సైన్యం, డీఆర్‌డీవోలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని