అవినీతి ఇకపై వాటికి ‘పాస్‌వర్డ్‌’ కాదు.. జైలుకెళ్లే మార్గం: జగదీప్‌ ధన్‌ఖడ్‌

అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోందని..అవకాశాలు, ఉద్యోగాలకు ఇకపై అవినీతి అనేది ఓ పాస్‌వర్డ్‌లా కాకుండా జైలుకు వెళ్లే మార్గంలా ఉంటుందని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ వ్యాఖ్యానించారు.

Published : 16 Apr 2024 04:39 IST

నాగ్‌పుర్‌: అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోందని..అవకాశాలు, ఉద్యోగాలకు ఇకపై అవినీతి అనేది ఓ పాస్‌వర్డ్‌లా కాకుండా జైలుకు వెళ్లే మార్గంలా ఉంటుందని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ వ్యాఖ్యానించారు. నాగ్‌పుర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌లో ఐఆర్‌ఎస్‌ అధికారుల 76వ బ్యాచ్‌ వీడ్కోలు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పరిపాలనను ఇకపై అవినీతి శాసించలేదని అన్నారు. నిద్రాణస్థితి నుంచి మేలుకున్న భారత్‌.. ప్రపంచశక్తిగా మారే దిశగా దూసుకుపోతోందని అభివర్ణించారు. అవినీతిని నిర్మూలించే విధంగా భారత్‌ రూపుదిద్దుకుంటోందని..వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చిందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని