పంజాబ్‌లో రైల్వేట్రాక్‌పై రైతుల బైఠాయింపు

హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీయేతర), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు.

Published : 18 Apr 2024 05:17 IST

చండీగఢ్‌, అంబాలా: హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీయేతర), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. హరియాణా సరిహద్దుకు సమీపంలో రైల్వే ట్రాక్‌పై బైఠాయించారు. ఫలితంగా 30కిపైగా రైళ్ల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. వాటిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లతో నిరసన ప్రదర్శన చేపట్టిన రైతుల్లో ముగ్గురిని హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఈ నెల 16 కల్లా విడుదల చేస్తామంటూ తొలుత హామీ ఇచ్చారని, కానీ ఇప్పటిదాకా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని అన్నదాతలు ఆరోపించారు. వారిని విడుదల చేసేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని