త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్‌షా

రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు.

Published : 18 Apr 2024 05:21 IST

అహ్మదాబాద్‌: రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టిన సందర్భంగా బుధవారం ఆయన స్పందించారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు, నక్సలైట్లపై అలుపెరగని పోరాటం చేస్తోందని షా పేర్కొన్నారు. ‘‘2014 నుంచి భద్రతాదళాల క్యాంపులను విరివిగా పెంచుతున్నాం. 2019 తర్వాత అటువంటివి 250 శిబిరాలను ఏర్పాటు చేశాం’’ అని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని