ఇరాన్‌ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల

ఇరాన్‌ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌ కుబేరుడికి చెందిన ఎంఎస్‌సీ ఏరీస్‌ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్‌ టెస్సా జోసెఫ్‌ సురక్షితంగా విడుదలయ్యారు.

Published : 19 Apr 2024 03:56 IST

కేరళకు చేరుకున్న అన్‌ టెస్సా జోసెఫ్‌

దిల్లీ: ఇరాన్‌ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌ కుబేరుడికి చెందిన ఎంఎస్‌సీ ఏరీస్‌ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్‌ టెస్సా జోసెఫ్‌ సురక్షితంగా విడుదలయ్యారు. కేరళలోని త్రిశ్శూర్‌కు చెందిన ఆమె గురువారం మధ్యాహ్నం కొచ్చిన్‌ విమానాశ్రయానికి చేరుకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆమెకు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి స్వాగతం పలికినట్లు పేర్కొంది. మిగిలిన 16 మంది భారతీయ సిబ్బంది కూడా సురక్షితంగా ఉన్నారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు టెహ్రాన్‌లోని భారత్‌ దౌత్య కార్యాలయం ఇరాన్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల 13న ఎంఎస్‌సీ ఏరిస్‌ నౌకను పర్షియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని