చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం

చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది.

Published : 19 Apr 2024 03:57 IST

దిల్లీ: చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. అత్యాచారం వంటి ఘోరమైన నేరాలకు పాల్పడేందుకు వైద్యపరంగా శారీరక సామర్థ్యం గలిగిన నిందితులనూ ఈ విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇటువంటి మార్గదర్శకాలను ఇప్పటి వరకూ జారీ చేయలేదనే అంశాన్ని న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తించింది. ఇద్దరు మైనర్‌ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఓ మూగ వ్యక్తికి బెయిల్‌ నిరాకరించిన సందర్భంగా మార్గదర్శకాల అంశం బెంచ్‌ దృష్టికి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని