యోగాగురు రాందేవ్‌ కేసుల పరిస్థితేంటి?

యోగాగురు రాందేవ్‌పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్‌ఐఆర్‌ వివరాలను సమర్పించాలని బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated : 20 Apr 2024 06:10 IST

వివరాలు సమర్పించాలని బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌లకు సుప్రీం ఆదేశం

దిల్లీ: యోగాగురు రాందేవ్‌పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్‌ఐఆర్‌ వివరాలను సమర్పించాలని బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు చెందిన పట్నా, రాయ్‌పుర్‌ శాఖలు 2021లో ఫిర్యాదు చేశాయి. ఇలా వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని కలపాలని కోరుతూ రాందేవ్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసులో ఫిర్యాదుదారులందరినీ ఇంప్లీడ్‌ చేయాలని పేర్కొంది.

మరో కేసులో పతంజలి యోగపీఠ్‌ ట్రస్ట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యోగా శిబిరాల్లో ప్రవేశానికి రుసుం తీసుకున్నందుకు సర్వీసు పన్ను కట్టాలని కస్టమ్స్‌, ఎక్సైజ్‌, సర్వీసు ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని శుక్రవారం సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రస్ట్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని