స్కూల్లో హెచ్‌ఎంకు ఫేషియల్‌ వీడియో తీసిన టీచరుపై దాడి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్‌ పనివేళల్లో ఫేషియల్‌ చేయించుకున్నారు.

Updated : 20 Apr 2024 06:06 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్‌ పనివేళల్లో ఫేషియల్‌ చేయించుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. విద్యార్థులకు ఆహారం వండే గదిలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్‌ చేయించుకోగా అనమ్‌ఖాన్‌ అనే ఉపాధ్యాయురాలు దాన్ని వీడియో తీశారు. దీన్ని గమనించిన సంగీతాసింగ్‌ ఒక్కసారిగా కుర్చీపై నుంచి లేచి ఉపాధ్యాయురాలిపై దాడి చేశారు. ఫోను లాక్కొనే క్రమంలో చేయిని కొరకడంతో అనమ్‌ఖాన్‌కు రక్త గాయమైంది. దీంతో తాను గాయాలతో ఉన్న వీడియోను కలిపి రెండింటినీ అనమ్‌ఖాన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయురాలిపై విచారణకు ఆదేశించారు. అనమ్‌ను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు