నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్‌కుమార్‌ త్రిపాఠి

నూతన నౌకాదళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కుమార్‌ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

Published : 20 Apr 2024 06:10 IST

 ఈ నెల 30న బాధ్యతల స్వీకరణ

దిల్లీ: నూతన నౌకాదళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కుమార్‌ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. త్రిపాఠి అదే రోజు మధ్యాహ్నం నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 1964 మే 15న జన్మించిన త్రిపాఠి ఇండియన్‌ నేవీలోని ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 1985 జులై 1న చేరారు. కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ యుద్ధంలో నిపుణుడైన ఈయనకు వివిధ హోదాల్లో పనిచేసిన దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. వైస్‌ చీఫ్‌గా చేరక ముందు వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరించారు. ఐఎన్‌ఎస్‌ వినాశ్‌కు కమాండర్‌గానూ పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని