రైలు పట్టాలపై రైతుల ఆందోళన

మూడు రోజుల క్రితం హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌లోని పటియాలా జిల్లా శంభూ రైల్వేస్టేషన్‌లోని రైలు పట్టాలపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

Published : 21 Apr 2024 05:20 IST

పంజాబ్‌లో 54 రైళ్లు రద్దు
నాలుగోరోజు కొనసాగిన అన్నదాతల నిరసన

అంబాలా: మూడు రోజుల క్రితం హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌లోని పటియాలా జిల్లా శంభూ రైల్వేస్టేషన్‌లోని రైలు పట్టాలపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అంబాలా-అమృత్‌సర్‌ మార్గంలో రాకపోకలు సాగించే 54 రైళ్లను శనివారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో రైతులు చేపట్టిన ఆందోళన కారణంగా 380 రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడిందని వెల్లడించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా(కేఎంఎం) ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. బుధవారం అంబాలా-లుధియానా-అమృత్‌సర్‌ మార్గంలో రైలు పట్టాలపై రైతులు ఆందోళనలు చేపట్టగా.. హరియాణా పోలీసులు ముగ్గురు రైతులను అరెస్టు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని రైతులకు నాయకత్వం వహించే సరవన్‌ సింగ్‌ పండేర్‌ శనివారం డిమాండ్‌ చేశారు. పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి తమ న్యాయమైన డిమాండ్‌లను నేరవేర్చాలని.. రైతు సంఘాలు ‘దిల్లీ చలో’ మార్చ్‌ను చేపట్టారు. ఫిబ్రవరి 13 నుంచి రైతుల పాదయాత్రను భద్రతా బలగాలు అడ్డుకోవడంతో హరియాణా-పంజాబ్‌ సరిహద్దు ప్రాంతాల్లోనే ఉంటూ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు