భారీ యుద్ధవిన్యాసాలు నిర్వహించిన నేవీ

తూర్పు తీరం వెంబడి భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహించినట్లు భారత నౌకాదళం శనివారం ప్రకటించింది. సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడంలో నేవీ పోరాట సన్నద్ధతను పరీక్షించుకోవడం దీని ఉద్దేశమని తెలిపింది.

Published : 21 Apr 2024 05:21 IST

దిల్లీ: తూర్పు తీరం వెంబడి భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహించినట్లు భారత నౌకాదళం శనివారం ప్రకటించింది. సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడంలో నేవీ పోరాట సన్నద్ధతను పరీక్షించుకోవడం దీని ఉద్దేశమని తెలిపింది. ‘పూర్వీ లెహర్‌’ పేరిట జరిగిన ఈ విన్యాసాల్లో యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు, నౌకాదళ ప్రత్యేక బలగాలు పాలుపంచుకున్నాయని పేర్కొంది. ఈ విన్యాసాలు బహుళ దశల్లో జరిగాయని వివరించింది. ఇందులో తూర్పు నౌకాదళంతోపాటు వాయుసేన; అండమాన్‌, నికోబార్‌ కమాండ్‌, తీర రక్షణ దళం కూడా పాల్గొన్నాయి. ఈ బలగాల మధ్య అద్భుత సమన్వయాన్ని ఈ యుద్ధక్రీడలు చాటాయని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని