సిసోదియా బెయిలు అభ్యర్థనలపై తీర్పు రిజర్వు

అవినీతి, నగదు అక్రమ చలామణీ, దిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లు నమోదుచేసిన కేసుల్లో బెయిలు మంజూరు చేయాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు (ఆప్‌) మనీశ్‌ సిసోదియా పెట్టుకున్న బెయిలు అభ్యర్థనలపై దిల్లీ న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

Published : 21 Apr 2024 05:22 IST

దిల్లీ: అవినీతి, నగదు అక్రమ చలామణీ, దిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లు నమోదుచేసిన కేసుల్లో బెయిలు మంజూరు చేయాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు (ఆప్‌) మనీశ్‌ సిసోదియా పెట్టుకున్న బెయిలు అభ్యర్థనలపై దిల్లీ న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా శనివారం కేంద్ర సంస్థలు, సిసోదియా తరఫు న్యాయవాదుల వాదనలు విన్నారు. అనంతరం తీర్పును ఈ నెల 30కి రిజర్వు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని