కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వాలి

మధుమేహంతో బాధపడుతున్న తమ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వాలంటూ ఆదివారం ఆప్‌ కార్యకర్తలు తిహాడ్‌ జైలు వెలుపల ఆందోళన నిర్వహించారు.

Published : 22 Apr 2024 06:25 IST

తిహాడ్‌ జైలు వెలుపల ఆప్‌ కార్యకర్తల ఆందోళన

దిల్లీ: మధుమేహంతో బాధపడుతున్న తమ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వాలంటూ ఆదివారం ఆప్‌ కార్యకర్తలు తిహాడ్‌ జైలు వెలుపల ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్‌ మంత్రి ఆతిశీ, ఆ పార్టీ ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా పాల్గొన్నారు. ‘‘ఇది నిరసన కాదు. సీఎం ఆరోగ్యంపై దిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయన కోసం వారు ఇన్సులిన్‌ పంపారు’’ అని ఆతిశీ పేర్కొన్నారు. ఆందోళనలో పాల్గొన్న ఆప్‌ కార్యకర్తలు ఇన్సులిన్‌ వయల్స్‌ చేతిలో పట్టుకొని జైలు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజ్రీవాల్‌కు హాని చేయడానికి కుట్ర జరుగుతోందని ఆతిశీ ఆరోపించారు. ఈ ఆరోపణలను తిహాడ్‌ అధికారులు ఖండించారు. కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎయిమ్స్‌లోని స్పెషలిస్టు వైద్యులకు శనివారం చూపించామని.. ఆ సందర్భంగా ఇన్సులిన్‌ అంశాన్ని దిల్లీ సీఎం ప్రస్తావించలేదని, వైద్యులు కూడా సూచించలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని