12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు

విమానయాన సంస్థలకు  పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది.

Published : 24 Apr 2024 04:07 IST

విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశం

దిల్లీ: విమానయాన సంస్థలకు  పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో చాలాసార్లు తమ పెద్ద వాళ్లకు దూరంగా కూర్చోవాల్సి వస్తోంది. దీనిపై డీజీసీఏకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన డీజీసీఏ, తల్లిదండ్రులు ఇద్దరిలో కనీసం ఎవరో ఒకరి వద్ద కూర్చునే అవకాశం కల్పిస్తే.. వారి ప్రయాణం సజావుగా జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరి పక్కన సీటును కేటాయిస్తే ఆ విషయాన్ని తప్పకుండా ప్రయాణ రికార్డుల్లో నమోదు చేయాలని కూడా సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని