25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్‌

పశ్చిమబెంగాల్‌లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

Published : 25 Apr 2024 04:04 IST

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఏకపక్షంగా వ్యవహరించిందని పేర్కొంది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చెల్లుబాటు కాదంటూ ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు నిర్వహించాలంటూ కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో దర్యాప్తు నివేదికనూ సమర్పించాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని