మణిపుర్‌లో వంతెనపై ఐఈడీ పేలుడు

మణిపుర్‌లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

Published : 25 Apr 2024 04:54 IST

150కి పైగా నిలిచిపోయిన సరకు రవాణా వాహనాలు

ఇంఫాల్‌: మణిపుర్‌లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో సేనాపతి జిల్లాలో 150పైగా నిత్యావసర సరకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్‌పోక్పీ జిల్లాలోని కౌబ్రు లేకా, సపర్మినాలను కలిపే వంతెనపై బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో పేలుడు జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాలోని మైతేయ్‌, కుకీ గ్రామ వాలంటీర్ల మధ్య ఘర్షణలు చెలరేగిన కొద్ది గంటల తర్వాత ఈ పేలుడు జరగడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని