ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం

గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్‌ దినోత్సవ శుభాకాంక్షలు.

Updated : 25 Apr 2024 07:05 IST

గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్‌ దినోత్సవ శుభాకాంక్షలు. పల్లెటూళ్లలో వెలుగులు నింపడానికి వారు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థలను బలోపేతం చేసి, ప్రజల కలలకు రెక్కలు తొడిగేందుకు మా ప్రభుత్వం నిరంతర కృషి చేస్తూనే ఉంటుందని హామీ ఇస్తున్నాను.

నరేంద్ర మోదీ


ఎన్నికల బాండ్లపై సిట్‌ దర్యాప్తు అవసరం

ఎన్నికల బాండ్ల పథకం ద్వారా అధికార భాజపా మాఫియా తరహాలో బలవంతపు వసూళ్లకు పాల్పడింది. ఈ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ కుంభకోణాన్ని నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో(సిట్‌) విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేస్తుందని ఆశిస్తున్నాను.

సీతారాం ఏచూరి


మీ మనశ్శాంతి మీ చేతుల్లోనే..

మీరు సాధించలేని వాటిని కోరుకోవడం వల్ల మీరు ఆందోళనకు గురవుతారు. మీరు సాధించగలిగేవాటిని ఆకాంక్షించడం ద్వారా మీరు వృద్ధి చెందుతారు. మీరు ఇప్పటికే కలిగి ఉన్నవాటికి విలువ ఇవ్వడం ద్వారా మీకు నిజమైన మనశ్శాంతి లభిస్తుంది. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది.

హర్ష్‌ గోయెంకా


టీకాలతో కోట్ల ప్రాణాలు నిలిచాయి

టీకాలతో రోగ నిరోధకతను పెంచడం ద్వారా గత 50 ఏళ్లలో 15.4 కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగాం. అంటే ఏటా ప్రతి నిమిషానికి ఆరు ప్రాణాలను నిలబెట్టగలిగాం. టీకాల ప్రాముఖ్యత ఏంటో దీనిద్వారా స్పష్టమవుతోంది.

యునిసెఫ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని