పెరుగుతున్న జీవక్రియ వ్యాధులు

మధుమేహం, అధిక రక్తపోటు, నడుం చుట్టూ కొవ్వు పెరగడం వంటి జీవక్రియ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని లాన్సెట్‌ వైద్య విజ్ఞాన పత్రికలో ప్రచురితమైన పరిశోధనా వ్యాసం హెచ్చరించింది.

Published : 18 May 2024 04:56 IST

దిల్లీ: మధుమేహం, అధిక రక్తపోటు, నడుం చుట్టూ కొవ్వు పెరగడం వంటి జీవక్రియ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని లాన్సెట్‌ వైద్య విజ్ఞాన పత్రికలో ప్రచురితమైన పరిశోధనా వ్యాసం హెచ్చరించింది. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం, జీవన శైలి మారడం వల్ల ఈ తరహా వ్యాధులు ప్రబలుతున్నాయి. 2000-2021 మధ్య కాలంలో జీవక్రియ సంబంధ వ్యాధుల వల్ల అనారోగ్యం పాలై త్వరగా మరణాల పాలవడం వంటివి 50 శాతం పెరిగాయని లాన్సెట్‌ నివేదిక వెల్లడించింది.  15-49 ఏళ్ల వయో వర్గంలోని వారిలో మధుమేహం, నడుం చుట్టూ కొవ్వు పెరుగుతోందని తెలిపింది. ఈ వర్గంలో చెడు కొలస్ట్రాల్, అధిక రక్తపోటు కూడా అధికమవుతున్నాయి. మారుతున్న జీవన శైలులూ ఈ రుగ్మతలను పెంచుతున్నాయి. వాయు కాలుష్యం, ధూమపానం, తక్కువ బరువుతో పుట్టడం కూడా 2000-2021 మధ్య పెరిగాయి. తల్లీ పిల్లల పోషకాహార లోపం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా,సహారా ఎడారి దిగువ దేశాలలో ఎక్కువగా ఉంది. మాతాశిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం కల్పించడం వల్ల వ్యాధుల పీడ తగ్గుతుందని రుజువైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని