అభిజిత్‌ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్‌ నోటీసులు

కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, భాజపా లోక్‌సభ అభ్యర్థి అభిజిత్‌ గంగోపాధ్యాయకు ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది.

Updated : 18 May 2024 05:46 IST

దిల్లీ: కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, భాజపా లోక్‌సభ అభ్యర్థి అభిజిత్‌ గంగోపాధ్యాయకు ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం హల్దియాలో ఈ నెల 15న జరిగిన బహిరంగ సభలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. ఆ వ్యాఖ్యలపై తృణముల్‌ కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. శుక్రవారం ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనీ, దీనిపై ఈ నెల 20లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మే 25న పోలింగ్‌ జరగనున్న తమ్లుక్‌ నియోజకవర్గం నుంచి ఆయన భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని