ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే మించిన సంతృప్తి ఏముంటుంది

వాణిజ్య రాజధాని ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’పై ఇటీవల రష్మిక ప్రయాణించారు.

Published : 18 May 2024 05:11 IST

రష్మిక వీడియోపై మోదీ స్పందన

ముంబయి: వాణిజ్య రాజధాని ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’పై ఇటీవల రష్మిక ప్రయాణించారు. ఈ అటల్‌ సేతును కారులో నుంచి వీక్షిస్తూ.. దాని గురించి మాట్లాడుతోన్న వీడియోను ఆమె తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ అద్భుతమైన మౌలిక సదుపాయాల కారణంగా ప్రయాణాలు సులభతరమైనప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. గత పదేళ్ల కాలంలో దేశం గొప్ప ప్రగతి సాధించింది. ఇప్పుడు మనం అభివృద్ధికి ఓటు వేయాలి’’ అని జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ నటి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని