కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన జంట గాయపడ్డారు.

Published : 19 May 2024 04:15 IST

రాజస్థాన్‌ జంటకు గాయాలు

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన జంట గాయపడ్డారు. యన్నర్‌లోని పర్యాటకుల రిసార్టువద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని తబ్రేజ్, ఫర్హాగా గుర్తించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

కశ్మీర్‌లోని షోపియాన్‌లో శనివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మాజీ సర్పంచి ఐజాజ్‌ షేక్‌ గాయపడ్డారు. హిర్పోరాలో ఈ కాల్పులు జరిగాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని