సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత

పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్‌పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు.

Published : 19 May 2024 05:46 IST

బిష్ణుపుర్‌: పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్‌పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. వేసవి ఎండ తీవ్రత, ఉక్కపోతతో అతను అనారోగ్యానికి గురయ్యారు. సభలో ఒక్కసారిగా కలకలం రేగడం గమనించిన మమతా బెనర్జీ తన ఉపన్యాసాన్ని వెంటనే నిలిపివేశారు. విషయం తెలుసుకుని ఆ వ్యక్తికి వెంటనే సపర్యలు చేయాలని కార్యకర్తలకు ఆదేశించారు. ‘అతని ముఖంపై నీళ్లు చిలకరించండి. అంబులెన్స్‌ను సిద్దంచేసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అని ఆమె సూచించారు. ఆ వ్యక్తి కోలుకునే వరకూ మమత ఓపిగ్గా వేసి చూశారు. ఓపిక తెచ్చుకున్న అతను పైకిలేవడంతో అంబులెన్స్‌లో జాగ్రత్తగా ఇంటికి చేర్చాలని సూచించి ఆమె తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని