సిగ్నల్‌కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం

రైలు సిగ్నల్‌ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 19 May 2024 06:27 IST

 ప్రయాణికులు ఎదురుతిరగడంతో దుండగుల పరార్‌! 

ఈటీవీ భారత్‌: రైలు సిగ్నల్‌ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొరాదాబాద్‌-సహారన్‌పుర్‌ రైల్వే డివిజన్‌లోని లక్సర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న రైలు సిగ్నల్‌కు కొందరు దుండగులు బురద పూశారు. సిగ్నల్‌ కనిపించకపోవడంతో పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పుర్‌- చండీగఢ్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. అనంతరం ప్రయాణికుల వస్తువులు, నగదును దోపీడీ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ప్రయాణికులు ఎదురు తిరగడంతో అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే లోకో పైలట్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న లక్సర్‌ ఆర్పీఎఫ్‌ ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి శివాచ్, జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ సంజయ్‌ శర్మ, జీఆర్పీ ఎస్పీ సరితా డోభాల్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని