ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ బోర్డు మూసివేత

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ బోర్డును కేంద్ర ప్రభుత్వం మూసేసింది. గత ఏడాది ఏప్రిల్‌ 6న జరిగిన కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంస్థను మూసేస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Published : 22 May 2024 04:14 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ బోర్డును కేంద్ర ప్రభుత్వం మూసేసింది. గత ఏడాది ఏప్రిల్‌ 6న జరిగిన కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంస్థను మూసేస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ సంస్థ 1964లో కేంద్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రారంభంకాగా, 1993లో దీన్ని మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలోకి మార్చారు. దీనికింద ఇప్పటివరకు ఫరీదాబాద్, ముంబయి, కోల్‌కతా, చెన్నైల్లో ప్రాంతీయ నాణ్యతా నియంత్రణ ప్రయోగశాలలు, అలాగే 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కమ్యూనిటీ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఎక్స్‌టెన్షన్‌ యూనిట్లు(సీఎఫ్‌ఎన్‌ఈయూ) పనిచేశాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను హేతుబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు 2020 నవంబర్‌లో చేసిన సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ బోర్డును మూసేయాలని నిర్ణయించింది. ఇందులో పనిచేస్తున్న 147 మంది ఉద్యోగుల్లో 33 మందికి స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించింది. మిగిలిన వారిని మహిళా, శిశు సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలకు పంపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని