సిసోదియాకు బెయిల్‌ నిరాకరణ

ఆప్‌ నేత, దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ, ఆయనకు బెయిల్‌ మంజూరు చేయలేమని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 22 May 2024 04:17 IST

తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న హైకోర్టు 

దిల్లీ: ఆప్‌ నేత, దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ, ఆయనకు బెయిల్‌ మంజూరు చేయలేమని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్‌ ఇవ్వాలని సిసోదియా చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రజాస్వామ్య సిద్ధాంతాలను సిసోదియా చర్య తీవ్రంగా వంచించిందని, కీలక ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. దిల్లీ సర్కారులో ఆయనది అత్యంత శక్తిమంతమైన పాత్ర అని, 18 మంత్రిత్వ శాఖలు ఆయన చేతిలో ఉండేవని గుర్తుచేసింది. సాక్షుల్లో అనేకమంది ప్రభుత్వాధికారులు ఉన్నారని, వారు ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చినందువల్ల వారిని ఆయన ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అవకాశాలు కొట్టిపారేయలేమని హైకోర్టు పేర్కొంది. ముందు విధించిన షరతుల ప్రకారం ఆయన ప్రతివారం తన భార్యను చూసి రావచ్చని మాత్రం అనుమతించింది. మరోవైపు.. నగదు అక్రమ చలామణి కేసులో సిసోదియా జుడిషియల్‌ కస్టడీని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని