మాలీవాల్‌పై దాడి కేసు.. బిభవ్‌ మళ్లీ దిల్లీకి తరలింపు

రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ నుంచి వివరాలు రాబట్టడానికి ఆయన్ని ముంబయికి తీసుకువెళ్లిన పోలీసులు బుధవారం తిరిగి దిల్లీకి తెచ్చారు.

Published : 23 May 2024 05:46 IST

దిల్లీ: రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ నుంచి వివరాలు రాబట్టడానికి ఆయన్ని ముంబయికి తీసుకువెళ్లిన పోలీసులు బుధవారం తిరిగి దిల్లీకి తెచ్చారు. కుమార్‌ ఫోన్లు, లాప్‌టాప్‌తో పాటు కేజ్రీవాల్‌ నివాసంలో సీసీటీవీలో నమోదైన దృశ్యాలను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. తనపై బురద జల్లాల్సిందిగా పార్టీలో ప్రతిఒక్కరిపైనా తీవ్ర ఒత్తిడి వస్తోందని మాలీవాల్‌ ఆరోపించారు. కేజ్రీవాల్‌ నివాసంలో సీసీటీవీ దృశ్యాలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలు ఘటనలో ఆయన ప్రమేయాన్ని, సహాయకుడిని కాపాడాలన్న ప్రయత్నాలను తేటతెల్లం చేస్తున్నాయని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఆరోపించారు. రాజీకోసం మాలీవాల్‌పై కేజ్రీవాల్‌ ఒత్తిడి పెంచుతున్నారని వారు విలేకరులకు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని