కేంద్ర హోం శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు

దేశ రాజధాని దిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. నార్త్‌ బ్లాక్‌లోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని పేల్చివేస్తామని దుండగులు హోం శాఖ అధికారి ఒకరికి మధ్యాహ్నం 3.30 గంటలకు బెదిరింపు ఈమెయిల్‌ పంపారు.

Published : 23 May 2024 05:19 IST

ఉత్తుత్తిదేనని తేల్చిన పోలీసులు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. నార్త్‌ బ్లాక్‌లోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని పేల్చివేస్తామని దుండగులు హోం శాఖ అధికారి ఒకరికి మధ్యాహ్నం 3.30 గంటలకు బెదిరింపు ఈమెయిల్‌ పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబు నిర్వీర్యక దళం సిబ్బంది, అగ్నిమాపక సేవల సిబ్బంది నార్త్‌బ్లాక్‌ను అణువణువూ గాలించారు. విజయ్‌ చౌక్, నార్త్‌ అవెన్యూ మార్గాల్లో అగ్నిమాపక యంత్రాలను దిల్లీ అగ్నిమాపక సేవల విభాగం సిద్ధం చేసింది. ‘‘భవనం మొత్తం తనిఖీ చేసినా ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో ఈమెయిల్‌ ఉత్తుత్తి బెదిరింపేనని తేలింది’’ అని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. తనిఖీల అనంతరం దిల్లీ పోలీసులు సైతం ఇదే ప్రకటన చేశారు. బాంబులతో పేల్చేస్తామంటూ దిల్లీలోని వివిధ కార్యాలయాలు, సంస్థలు, ఆసుపత్రులకు గత కొన్నివారాలుగా బెదిరింపు ఈమెయిళ్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని