మోదీ బస చేసిన బిల్లు కట్టండి.. కర్ణాటక అటవీశాఖకు హోటల్‌ యాజమాన్యం లేఖ

బండిపుర పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసి 50 ఏళ్లయిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ గతేడాది ఏప్రిల్‌లో కర్ణాటకలోని మైసూరు నగరాన్ని సందర్శించారు. నగరంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బసచేశారు. దాని బిల్లును కేంద్రం ఇప్పటివరకూ విడుదల చేయలేదు.

Published : 26 May 2024 04:29 IST

మైసూరు, న్యూస్‌టుడే: బండిపుర పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసి 50 ఏళ్లయిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ గతేడాది ఏప్రిల్‌లో కర్ణాటకలోని మైసూరు నగరాన్ని సందర్శించారు. నగరంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బసచేశారు. దాని బిల్లును కేంద్రం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. తమకు రావలసిన బకాయితోపాటు దానిపై 18% వడ్డీతో కలిపి రూ.80 లక్షలు అయిందని, ఆ మొత్తాన్ని జూన్‌ ఒకటిలోగా విడుదల చేయించాలంటూ.. హోటల్‌ యాజమాన్యం కర్ణాటక అటవీశాఖ అధికారులకు లేఖ రాసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని