మహిళల హాకీ థీమ్‌తో ప్రత్యేక ఆకర్షణగా రాంచీ పోలింగ్‌ స్టేషన్‌

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాంచీ నియోజకవర్గం పోలింగ్‌ కేంద్రంలో ‘ఝార్ఖండ్‌ మహిళల హాకీ థీమ్‌’తో ఏర్పాటు చేసిన బ్యానర్లు, పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బారియాతలోని సీఎం స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పోలింగ్‌ కేంద్రంలో వీటిని ఏర్పాటు చేశారు.

Published : 26 May 2024 04:38 IST

రాంచీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాంచీ నియోజకవర్గం పోలింగ్‌ కేంద్రంలో ‘ఝార్ఖండ్‌ మహిళల హాకీ థీమ్‌’తో ఏర్పాటు చేసిన బ్యానర్లు, పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బారియాతలోని సీఎం స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పోలింగ్‌ కేంద్రంలో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ సలీమా టెటె, ఒలింపియన్‌ నిక్కీ ప్రధాన్, సంగీత కుమారీల ఫోటోలు ఉన్నాయి. ఝార్ఖండ్‌లోని గిరిజన యువత హకీ, విలువిద్య రంగాలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇక్కడి నుంచి చాలామంది క్రీడాకారులు ఒలింపిక్స్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఈ వినూత్న థీమ్‌ ద్వారా ఓటర్లకు స్ఫూర్తి కలుగుతుందని, మహిళల హాకీకి ప్రాచుర్యం లభిస్తుందని రాంచీ పరిపాలన విభాగం అధికారి ఒకరు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని